రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో రూపొందించబడిన భీమదేవరపల్లి బ్రాంచి ఇటీవల మైత్రి మూవీస్ ద్వారా విడుదలై మంచి ప్రేక్షకధారణ పొంది.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నేటివిటీ సినిమాల్ని ఇష్టపడుతున్న నేటి ప్రేక్షకులకి భీమదేవరపల్లి బ్రాంచి పల్లె ప్రజల జీవన విధానాన్ని అమాయకత్వాన్ని ,సంస్కృతిని సంఘర్షణని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.
భీమదేవరపల్లి బ్రాంచిలో బలమైన కథ ఉంది...రాజకీయ నాయకుల తప్పుడు వాగ్దానాలు నమ్మి ప్రజలు ఎలా అవస్థలు పడతారో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఉచిత పథకాల మీద దర్శకుడు తన మాటలతో వ్యంగ్య హస్త్రాల సంధించాడు. "ఉచితాలు అసలు ఉచితాలే కాదు!! అవి మరోరకంగా మన మీద వేసే భారాలు", "ప్రభుత్వాలు పని కల్పించాలి కానీ ప్రజలకు పైసలు ఇవ్వకూడదు" అంటూ రచయిత -దర్శకుడు రమేష్ చెప్పాల తన సామాజిక స్పృహని దృశ్యరూపంగా మార్చాడు.
నటీనటులు అందరూ కొత్త వాళ్ళే అయినా పాత్రకి తగ్గట్టు వాళ్ళను ఎన్నుకోవడం వల్ల ఒక ఒరిజినాలిటీ కనిపించింది. సమాజాన్ని మేల్కొల్పే కథంశమే అయినప్పటికీ ఆధ్యాంతం వినోదభరితంగా ఉండడంతో రెండు గంటలు ఎంజాయ్ చేస్తారు.
నటీ నటులు
అంజి వల్గమాన్, సాయి ప్రసన్న,సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్),రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్(బీ.ఎస్), శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి,పద్మ, మానుకోట ప్రసాద్, తాటి గీత, విద్యా సాగర్, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, బైరన్న, కటారి, రజిని, సుష్మా.
సాంకేతిక నిపుణులు
రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల.
నిర్మాతలు: డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి.
కెమెరా: కె.చిట్టి బాబు.
సంగీతం: చరణ్ అర్జున్,
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, సంజయ్ మహేష్ వర్మ,
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి.
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే.
0 Comments