విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాగా మొదటి ప్రయత్నంలోనే అందర్నీ మెప్పించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. శివానీ రాజశేఖర్ తన పాత్రలో లీనమైంది. బబ్లూ సాయి కుమార్, అంకిత్ కొత్త, వైవా సన్నీ, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ తెరకెక్కించే క్రమంలో కొంత పట్టు తప్పింది. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మణిశర్మ గురించి చెప్పేది ఏముంది ఆయన అందించిన పాటలు, బీజీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చాయి
0 Comments