హీరో వేణు తొట్టెంపూడి నటించిన వెబ్ సిరీస్ 'అతిథి'. ప్రవీణ్ సత్తారు నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ:
రవి (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) దంపతులు ఇద్దరే పెద్ద ఇంటిలో ఉంటారు. భార్య కాళ్ళు చచ్చుబడిపోవడంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు రవి. ఓ వర్షం కురిసిన రాత్రి ఆ ఇంటికి మాయ (అవంతిక) వస్తుంది. ఆ తర్వాత యూట్యూబర్ సవేరి (వెంకటేష్ కాకుమాను) కూడా వస్తాడు. రవి ఇంటికి సమీపంలోని దెయ్యాల మిట్టలో ఏ ఆడ దెయ్యం లేదని వీడియో చేయడానికి వచ్చిన సవేరికి దెయ్యం కనిపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రవి ఇంటికి వస్తాడు. వాళ్ళ వెనుక ప్రకాష్ (రవి వర్మ) వస్తాడు.
మాయ తనను వెంటాడుతూ వచ్చిన దెయ్యం అని సవేరి భయపడతాడు. ఆమె దెయ్యం కాదని రవి చెబుతాడు. నిజంగా మాయ దెయ్యమా? లేదంటే అసలు దెయ్యం వేరొకరు ఉన్నారా? రవి భార్య సంధ్యను అసలు ఎవరైనా చూశారా? లేదా? ఆ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయనేది నిజమా? అబద్ధమా? - ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే 'అతిథి' వెబ్ సిరీస్ చూడాలి.
విశ్లేషణ:
వేణు తొట్టెంపూడి నటన సీరీస్ కు పెద్ద అసెట్. రవి పాత్రను ఆయన పూర్తి న్యాయం చేశాడు. సంధ్య పాత్ర పరిధి మేరకు అదితి గౌతమ్ నటించి మెప్పించారు. మాయ పాత్రలో అవంతిక ఆకట్టుకున్నారు. అందంతో మాయ చేసే మహిళగా తొలి, మలి ఎపిసోడ్లలో కనిపించారు. ఆ తర్వాత అభినయంతోనూ మెప్పించారు. రవివర్మ, వెంకటేష్ కాకుమాను, భద్రం వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
'అతిథి'ని దర్శకుడు భరత్ ఆసక్తికరంగా ప్రారంభించారు. మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ కథపై క్యూరియాసిటీ కలిగించాయి. అందుకు కారణం... మంచి దెయ్యం కాన్సెప్ట్ తీసుకున్నారు, కథనం, సన్నివేశాలు ఆసక్తిగా ఉన్నాయి. కథనం పరంగా 'అతిథి'లో కొత్తదనం ఏమీ లేదు. కథగా చూస్తే.. మంచి దెయ్యం కాన్సెప్ట్, చివరిలో ఇచ్చిన సందేశం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. స్టార్టింగ్ సీన్స్ నుండి చివరి ఎపిసోడ్స్ వరుకు బాగా డీల్ చేశారు భరత్. ప్రవీణ్ సత్తారు ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. వేణు హౌస్ సెట్ బావుంది. చివరిలో మహారాజు సన్నివేశాలు ఇలా అన్ని ఈ సీరీస్ కు కుదిరాయి. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం బాగున్నాయి.
రెగ్యులర్ హారర్ సిరీస్‌లకు కాస్త డిఫరెంట్ 'అతిథి'. థ్రిల్స్ & హారర్ మూమెంట్స్ బాగున్నాయి. ఎంగేజ్ చేసే ఎపిసోడ్స్, సన్నివేశాలు ఉన్నాయి. నటీనటుల్లో వేణు తొట్టెంపూడి, అవంతిక, వెంకటేష్ కాకుమానుల నటన, ఆ పాత్రలు గుర్తు ఉంటాయి.
చివరిగా: అతిధి ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాడు.
రేటింగ్: 3/5
0 Comments