హైదరాబాద్‌లో మొదటిసారిగా 'డిజైనతాన్'ను నిర్వహించింన Coursevita. డిజైన్ మరియు క్రియేటివ్ రంగ ఔత్సాహులకు కొత్త అవకాశం


Coursevita నేడు హైదరాబాద్‌లో డిజైనర్స్ మరియు క్రియేటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డిజైనతాన్' అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. నగరంలో మొదటిసారిగా జరిగిన ఈ 12-గంటల ఈవెంట్‌లో UI/UX డిజైన్ ఆసక్తులు, గ్రాఫిక్ డిజైనర్లు ,క్రియేటర్లు మరియు ఎడిటర్లు విభిన్న క్రియేటివ్ ఛాలెంజ్‌లలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
'డిజైనతాన్' కార్యక్రమంలో భాగంగా Coursevita యొక్క పోర్ట్‌ఫోలియో బిల్డర్, జాబ్ సిమ్యులేషన్, మరియు క్విజ్‌విటా లాంటి సరికొత్త టెక్నాలజీలను ఇక్కడే ఆవిష్కరించడం జరిగింది. ఈ సంస్థ యొక్క నూతన టెక్నాలజీ ఆవిష్కరణల ద్వారా విద్యార్ధి నుండి ఉద్యోగి గా ఎదగడానికి సరి అయిన నైపుణ్యాలు పొందవచ్చు.

ఈ సందర్భంగా Coursevita వ్యవస్థాపకుడు అర్జున్ వినయ్ మాట్లాడుతూ:
"హైదరాబాద్‌లో అతిపెద్ద డిజైన్ పోటీకి  మేము ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రధానంగా ఐటీ రంగం వైపే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక డిజైనర్లను, క్రియేటర్లను ఒకే వేదిక పైకి తీసుకువచ్చాం. AI అభివృద్ధితో, కొత్త కొత్త సాంకేతిక ఒరవడులతో ఉద్యోగ అవకాశాలు  ప్రతి దినం మారిపోతూ ఉన్నాయి. నగరంలో  డిజైన్ మరియు సృజనాత్మక రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధులు పై ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది ఒక గొప్ప వేదికగా నిలవబోతుంది."
ఈ కార్యక్రమంలో భాగంగా  Coursevita నిర్వహించబోయే "వైబ్ కోడింగ్ టూర్" కూడా ప్రారంభించడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం AI నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ఒక కొత్త కార్యక్రమం.

ఈ డిజైనతాన్ లో 400 మంది విద్యార్థులు, డిజైనర్లు , కంటెంట్ క్రియేటర్లు పాల్గొన్నారు. విజేతలు మరియు పాల్గొన్నవారికి ఆసక్తికరమైన బహుమతులు అందించగా, విజేతలకు రూ. 50,000 నగదు బహుమతులు ఇవ్వబడినాయి. అలాగే, ప్రతిభ చూపిన అభ్యర్థులకు  Coursevita లో చేరే అవకాశాన్ని కూడా అందించారు. 2024లో స్థాపించబడిన Coursevita విద్యార్థులు మరియు ఉద్యోగులకు తమ నైపుణ్యాల్లను పెంపొందించుకోడానికి అవసరమైన అప్‌స్కిల్లింగ్ కోర్సులు అందిస్తోంది. తద్వారా నేటి మరియు రేపటి ఉద్యోగ అవకాశాలకు అర్హత ఉండేలా సహాయపడుతుంది.

Post a Comment

0 Comments